GOOD NEWS: టమాట పంటకు బీమా వర్తింపు
AP: టమాట పండించే రైతులకు గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం రబీలో టమాట పంటకు బీమా వర్తింపజేసింది. ఈ పథకం ద్వారా ఎకరా పొలంలో రైతు వాటా రూ.1,250, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా రూ.1,250 చెల్లిస్తే రూ.25,000 పంట బీమా పొందవచ్చు. బ్యాంకు ద్వారా లోన్ తీసుకున్న రైతుకు బ్యాంకు ద్వారానే ఇన్సూరెన్స్ వస్తుంది. వద్దనుకుంటే డిసెంబర్ ఏడో తేదీలోపు రద్దు చేసుకునే అవకాశం ఉంది. వీరికి ప్రీమియం తిరిగి ఇచ్చేస్తారు.