కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రసార (పవర్ ట్రాన్స్‌మిషన్) రంగానికి సైతం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (PLI) పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) చివరికల్లా పీఎల్ఐను వర్తింపజేయాలని చూస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచస్థాయిలో ట్రాన్స్‌మిషన్ పరికరాల కొరత కారణంగా ధరలు పెరిగిపోతుండటంతో తాజా ఆలోచనకు తెరతీస్తున్నట్లు తెలియజేశారు.