పేపర్ లీకేజీపై స్పందించిన రాష్ట్రపతి

65చూసినవారు
పేపర్ లీకేజీపై స్పందించిన రాష్ట్రపతి
దేశంలో వరుసగా పలు పరీక్షల పేపర్లు లీక్ అవుతున్నాయి. ఈ ఘటనలపై తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. నీట్, నెట్ పేపర్ లీకేజీపై ఆమె మాట్లాడుతూ.. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. పేపర్ లీకేజీపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందన్నారు. పేపర్ లీకేజీపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం ప్రభుత్వ జవాబుదారీతనాన్ని తెలియజేస్తుందన్నారు. అలాగే దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రపతి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :