Top 10 viral news 🔥
విద్యార్థి సూసైడ్.. నారాయణ ప్రిన్సిపాల్‌ను పరిగెత్తించి కొట్టారు!
TG: మేడ్చల్ జిల్లా అనోజిగూడ నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్న విద్యార్థి తనుష్(16) సూసైడ్ చేసుకున్నాడు. లెక్చరర్ టార్చర్ చేయడం వల్లే బాత్రూంలో తనుష్ ఉరేసుకుని చనిపోయాడని తండ్రి ఆరోపించారు. దీంతో కాలేజీ వద్ద తనుష్ తల్లిదండ్రులు, బంధువులు గేట్ తాళం విరగ్గొట్టి లోపలికి వెళ్లి ప్రిన్సిపాల్ రామ్ రెడ్డిని పరిగెత్తించి కొట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.