మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేశ్
AP: మంత్రి నారా లోకేశ్ మాట నిలబెట్టుకున్నారు. నెల్లూరుకు చెందిన షేక్ మున్నీ జీవనోపాధి కోసం కువైట్ వెళ్లి అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. తనను ఎలాగైనా ఇండియాకు తీసుకురావాలని మంత్రి లోకేశ్‌ను ఎక్స్ వేదికగా కోరారు. దీనిపై మంత్రి లోకేేశ్ స్పందించారు. ఇంటికి తీసుకొస్తామని మాటిచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి.. షేక్ మున్నీని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు.