AP: తిరుపతి జిల్లా రేణిగుంటలో వైసీపీ హయాంలో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. శనివారం తెల్లవారుజామున పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు. రేణిగుంట పరిధిలోని కుర్ర కాలువ, చెంగారెడ్డి పల్లి, సూరప్పకసం పంచాయతీలోని సుమారు 144 అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు.