త్వరలోనే పోలీసు ఉద్యోగాల భర్తీ: హోంమంత్రి అనిత
AP: పోలీసు, జైళ్లు, న్యాయశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆయా శాఖలు సమర్థంగా పని చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రత్యేక, ఫాస్ట్‌ట్రాక్, ఏసీబీ కోర్టుల్లో మహిళలకు సత్వర న్యాయం అందించేలా న్యాయ వ్యవస్థలను మరింత పటిష్టపరుస్తామన్నారు. గత ప్రభుత్వంలో అక్రమ కేసుల బారిన పడిన వారికి న్యాయం చేస్తామన్నారు.