జర్మనీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మాగ్డేబర్గ్‌లోని క్రిస్మస్ మార్కెట్‌లో ప్రజల పైకి ఓ కారు 400 మీటర్లు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా ఇద్దరు మృతిచెందగా.. 60 మందికి పైగా గాయపడ్డారు. సౌదీ అరేబియాకు చెందిన తలేబ్‌ను(50) బీఎమ్‌డబ్ల్యూ కారును అద్దెకు తీసుకొని నడిపాడు. క్రిస్మస్ మార్కెట్‌లో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు కారణమైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.