కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకోండి: వైఎస్ జగన్
కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకోండి అని శుక్రవారం కృష్ణా జిల్లా వైసీపీ నేతలతో తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో వైఎస్ జగన్ అన్నారు. "నేను మీ అందరికీ కోరేది ఒక్కటే. మనలో పోరాట పటిమ సన్నగిల్లకూడదు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలు, నష్టాలు ఉంటాయి. కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకోండి. మనకు అదొక పరీక్షా సమయం. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. బెయిల్ కూడా ఇవ్వలేదు." అని జగన్ పేర్కొన్నారు.