ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరాన్ని కాలుష్య రహితంగా మార్చాలనే లక్ష్యంతో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (NCT)లోని అన్ని వాహనాలకు కలర్ కోడెడ్ స్టిక్కర్లు తప్పనిసరిగా అతికించాలని ఢిల్లీ రవాణా శాఖ ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ వాహనాలకు స్టిక్కర్లు వేయకుంటే రూ. 5,500 నుంచి రూ. 10,000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయితే ఈ స్టిక్కర్ల సాయంతో కార్ ఫ్యూయల్ టైప్‌ను త్వరగా గుర్తించవచ్చు.