పుష్ప-2 ప్యాన్ ఇండియా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం శుక్రవారం ముంబైలో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్‌మీట్‌లో నిర్మాత యలమంచిలి రవి మాట్లాడుతూ.. "పుష్ప-2 రిలీజ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ సినిమాను భారీ ఎత్తున వరల్డ్ వైడ్‌గా ఆరు భాషల్లో డిసెంబర్ 5న 12,000 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. ఐమాక్స్ వెర్షన్‌లో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్న ఇండియన్ సినిమా పుష్ప-2." అని అన్నారు.