షాద్ నగర్: మరో ఉద్యమానికి సిద్ధం: అశోక్ యాదవ్

52చూసినవారు
షాద్ నగర్: మరో ఉద్యమానికి సిద్ధం: అశోక్ యాదవ్
షాద్ నగర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ పిలుపు మేరకు శుక్రవారం దీక్షా దివస్ కార్యక్రమం విజయవంతం అయిందని నందారం అశోక్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో కేసీఆర్‌ సచ్చుడో అని నినాదమిచ్చి రాష్ట్ర సాధన కోసం మృత్యువును సైతం ముద్దాడేందుకు కేసీఆర్‌ తెగించిన రోజు దీక్షా దివస్ అని పేర్కొన్నారు. మరో ఉద్యమానికి సిద్ధమన్నారు.

సంబంధిత పోస్ట్