వందే భారత్‌కు తప్పిన పెను ప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ జిల్లాలో వందే భారత్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం సాయంత్రం ఝాన్సీ స్టేషన్ సమీపంలో రైల్వే అండర్‌పాస్‌పై కొంతమంది యువకులు బైక్‌తో రైల్వే ట్రాక్‌ను దాటుతుండగా వందేభారత్ రైలు వస్తుండటంతో బైక్‌ను పట్టాలపైనే వదిలి పారిపోయారు. దీంతో పట్టాలపై ఉన్న బైక్‌ను వందే భారత్ వేగంగా ఢీకొట్టి కొంతదూరం లాక్కెళ్లింది. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.