AP: పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది. తమిళనాడుకు చెందిన ఓ యువకుడు అత్తిలి రైల్వే స్టేషన్లో ఉన్న కరెంట్ పోల్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేశాడు. దాంతో స్టేషన్ మాస్టర్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆ యువకుడు విద్యుత్ వైర్‌ను తాకి కిందపడి చనిపోయినట్లు స్టేషన్ మాస్టర్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.