మాజీ మంత్రి విడదల రజిని కోరిక నెరవేరిందా?

534చూసినవారు
మాజీ మంత్రి విడదల రజిని కోరిక నెరవేరిందా?
AP: ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ రూట్ మార్చింది. పార్టీలో అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టింది. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లను మార్చేశారు. మాజీ మంత్రి విడదల రజినికి సంబంధించి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. చిలకలూరిపేటలో కావటి మనోహర్ నాయుడు స్థానంలో ఇన్‌ఛార్జ్‌గా మాజీ మంత్రి విడదల రజినిని నియమించింది. దాంతో విడదల రజిని కోరిక నెరవేరినట్లు ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్