కన్నీళ్లు పెట్టుకున్న యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ (వీడియో)
యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను నటించిన ‘లీలా వినోదం’ ప్రమోషనల్ ఈవెంట్లో ఎమోషనల్ అయ్యి మాట్లాడారు. ‘ఎవరో చేసిన తప్పుకి నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నా తల్లిదండ్రులని, అభిమానుల్ని చాలా బాధపెట్టాను. దయచేసి క్షమించండి. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి ‘లీలా వినోదం’ ప్రాజెక్ట్ వచ్చింది. కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చిన వాళ్లే నిజమైన మిత్రులని తెలుసుకున్నా.’ అని అన్నారు.