వారి ఖాతాల్లోకి రూ.6,000.. ఎప్పుడంటే?
తెలంగాణలో 25 లక్షల కుటుంబాలకు ఎలాంటి సాగు భూమి లేదని ధరణి కమిటీ నివేదిక పేర్కొంది. వీరిలో 70 శాతం దళితులేనని తేల్చింది. అయితే భూమి లేని పేదలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి ఉపాధి హామీ కార్డులు, కులగణన సర్వే వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని చూస్తోంది. మొదటి విడతగా జనవరిలో రూ.6 వేల చొప్పున నగదు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం.