27 ఏళ్లకే మృత్యుఒడికి..!
నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన ఐదుగురు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వారంతా చిన్ననాటి స్నేహితులు. కష్టసుఖాలను కలిసే పంచుకున్నారు. ఎక్కడెక్కడో ఉంటున్న ఆరుగురు కలిసి చేపట్టిన యాత్ర ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కారులో రాజస్థాన్ అజ్మేరా దర్గాకు వెళ్లి వస్తుండగా కారు టైర్ పేలి ఐదుగురు మృతి చెందారు. వీరంతా కూడా 27 ఏళ్ల లోపు వాళ్లే. దీంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.