మండలంలో చిరుజల్లులు

584చూసినవారు
జిన్నారం మండలంలో వాతావరణ మార్పుల కారణంగా ఒక్కసారిగా గురువారం రాత్రి చిరుజల్లులు కురిశాయి. మండలంలోని పెద్దమ్మ గూడెం జగంపేట వావిలాల కొడకంచి మంగంపేట ఉట్ల తదితర గ్రామాల్లో 15 నిమిషాల పాటు చిరుజల్లుల కురిశాయి. గత రెండు మూడు రోజులుగా 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండగా చిరుజల్లులతో 33 డిగ్రీలకు చేరుకున్నాయి. వారం రోజుల నుంచి ఉన్న ఉక్కపోత కొంతవరకు తగ్గడంతో ప్రజలకు ఎండ వేడిమి నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది.

సంబంధిత పోస్ట్