
జగన్ సైకోగా మారడమే ‘జగన్ 2.0’: మంత్రి సంధ్యారాణి
AP: జగన్ సైకోగా మారడమే ‘జగన్ 2.0’ అని మంత్రి సంధ్యారాణి విమర్శించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శవం లేస్తే కానీ బయటకు రాని దుర్మార్గుడు జగన్ అని ఆరోపించారు. వైఎస్ విజయలక్ష్మి, షర్మిల ఆయుష్షు గట్టిది కాబట్టే జగన్కు దూరంగా ఉంటున్నారని చెప్పారు. జగన తీరు మార్చుకోకుంటే.. రాష్ట్ర ప్రజలే ఏపీ నుంచి బయటకు గెంటేస్తారని అన్నారు. ఆత్మతో మాట్లాడే జగన్ మానసిక పరిస్థితి అందరికీ తెలుసని విమర్శించారు.