రూటు మార్చిన సీఎం చంద్రబాబు!
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. పార్టీని, ఎమ్మెల్యేలను మొదటి నుంచి కంట్రోల్లో పెట్టి సరైన మార్గంలో వెళ్లేలా చేయాలనుకుంటున్నారు. నేరుగా ఇంటెలిజెన్స్ నుంచి నివేదికలు తెప్పించుకుని నేతలకు హెచ్చరిక సంకేతాలు పంపిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం టీడీపీఎల్పీ సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేస్తున్నారు. గీత దాటితే ఎవర్నీ వదిలేది లేదని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.