ఐటీలో 5 లక్షల ఉద్యోగాలే మా లక్ష్యం: లోకేశ్
AP: మూడు నెలల్లో విశాఖకు TCS వస్తుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 'ఐదు సంవత్సరాల్లో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే మా లక్ష్యం. టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించాయి. ఈ పరిశ్రమలను ఆనాడు చొరవతో తీసుకొచ్చాం. అనేక సదస్సులు ఏర్పాటు చేసి విశాఖపై దృష్టి సారించాం. 2019-24 మధ్య ఒక్క పరిశ్రమ కూడా రాలేదు' అని అన్నారు.