భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. గయానా అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్లెన్స్’ను ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ మోదీకి అందజేశారు. ప్రపంచ దేశాలకు ఆయన అందిస్తున్న సహాయ సహకారాలకు గాను ఈ గుర్తింపు లభించింది. ప్రస్తుతం గయానాలో పర్యటిస్తున్న మోదీ.. ఆ దేశంతో 10 ఒప్పందాలు చేసుకున్నారు. మరోవైపు డొమినికా దేశ అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్.. ప్రధాని మోదీని నేడు ‘డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్’తో సత్కరించారు.