మధ్యప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఖాండ్వాలోని పలివాల్ ఎంటర్ప్రైజెస్ గోదాములో గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో రూ. 50 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.