పరిశ్రమల్లో భద్రతపై కలెక్టర్ సమీక్ష సమావేశం

66చూసినవారు
పరిశ్రమల్లో భద్రతపై కలెక్టర్ సమీక్ష సమావేశం
పరిశ్రమల్లో పారిశ్రామిక భద్రత స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ పై జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల శాఖ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల్లో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలపై చర్చించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.