ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరాల నియంత్రణే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని మళ్లీ శాంతి భద్రతలను గాడిలో పెట్టాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబెషనరీ ఏఎస్పీలు, డీఎస్పీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. గతంలో రౌడీలు రాజకీయాల్లోకి వచ్చినా పార్టీలు మద్దతు తెలిపేవి కావని ఇప్పుడు నేరస్తులే రాజకీయ ముసుగు వేసుకున్నారని అన్నారు.