వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ భూములపై విచారణ జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. అటవీ భూములెన్ని అనే అంశంపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని గురువారం వైఎస్‌ఆర్ జిల్లా కలెక్టర్‌ను పవన్ ఆదేశించారు. అటవీ భూముల సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని పవన్ స్పష్టం చేశారు. సీకే దిన్నె పరిధిలో 42 ఎకరాల్లో ఫారెస్ట్ భూములున్నాయన్న విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో అటవీ అధికారులతో పవన్ చర్చలు జరిపారు.