సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. సొంత బావను బామ్మర్ది దారుణంగా హత్య చేశాడు. ఇటీవల ఇద్దరు కలిసి జేసీబీ కొనుగోలు చేశారు.ఈ క్రమంలో జేసీబీని సొంతం చేసుకోవాలని ప్లాన్ వేసిన బామ్మర్ది.. బావను మద్యం తాగడానికి పిలిచాడు. మద్యం తాగిన తర్వాత స్నేహితుడి సాయంతో చంపేసి మృతదేహాన్ని శ్మశాన వాటికలో పడేసి పారిపోయాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నేరం రుజువు కావడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.