9 నెలలుగా ఫ్రిడ్జ్‌లోనే ప్రియురాలి మృతదేహం (వీడియో)
మధ్యప్రదేశ్‌లోని బృందావన్ ధామ్‌లో ఘోరం జరిగింది. ప్రియురాలిని చంపిన ప్రియుడు ఫ్రిడ్జ్‌లో మృతదేహాన్ని ఉంచి రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోయాడు. 9 నెలల తర్వాత ఇంట్లో నుంచి దుర్గంధం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ‘సంజయ్ పాటిదార్ తన ప్రియురాలు ప్రతిభతో కలిసి రూమ్‌లో ఉండేవాడు. పెళ్లి చేసుకోమని ప్రతిభ ఒత్తిడి చేయడంతో ఆమెను హత్య చేసి.. మృతదేహాన్ని ఫ్రిడ్జ్‌లో ఉంచి రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోయాడు. దర్యాప్తు జరుగుతోంది.’ అని పోలీసులు అన్నారు.