'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్ పార్టీలో మహేష్ బాబు.. ఫోటోలు వైరల్
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా టీమ్ ఏర్పాటు చేసిన సక్సెస్ పార్టీలో మహేష్ బాబు పాల్గొన్నారు. చిత్ర బృందంతో ఆయన కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ వైరల్గా మారాయి. ఈ సక్సెస్ పార్టీలో మహేష్ సతీమణి నమ్రతా, నిర్మాత సురేష్ బాబు, దర్శకులు వంశీ పైడిపల్లి, మెహర్ రమేశ్ తదితరులు పార్టీకి హాజరై సందడి చేశారు.