కర్నూలులో 1200 ఎకరాల్లో EV పార్కు.. 25 వేల మందికి ఉద్యోగాలు

67చూసినవారు
కర్నూలులో 1200 ఎకరాల్లో EV పార్కు.. 25 వేల మందికి ఉద్యోగాలు
ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర 1200 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్ పార్కు నెలకొల్పేందుకు పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో MOU చేసుకుంది. "వాహన తయారీ, R&D కేంద్రాలు, టెస్టింగ్ ట్రాక్స్, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ప్రాంతాలు లాంటివి ఇందులో ఉంటాయి. దేశంలో ఇదే తొలి ప్రైవేట్ EV పార్కు. దీని ద్వారా రూ.13 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి, 25 వేల మందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాలు లభిస్తాయి." అని శుక్రవారం ఆ సంస్థ సీఈఓ టి.జి.విశ్వప్రసాద్ వివరించారు.

సంబంధిత పోస్ట్