కృష్ణా నీటి వాటాల పాపం బీఆర్ఎస్ పార్టీదేనని, పదేళ్ల పాటు తెలంగాణకు తీరని ద్రోహం చేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 70 శాతం వాటా రావాలనే వాదనను లేవనెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వం అని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీలు వాడుకునేలా BRS ఒప్పందం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిందని విమర్శించారు.