వీరభద్ర స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కోదండరాం పూజలు
కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం నేడు ముడుపు విప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వీరభద్ర స్వామి దర్శించుకున్న కోదండరాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ముడుపు కట్టారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయిన కోదండరాం సోమవారం ఆలయంకి హాజరై ముడుపు విప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల జేఏసీ నాయకులు పాల్గొన్నారు.