JIO కస్టమర్లకు షాక్
రిలయన్స్ జియో పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు షాకిచ్చింది. రూ.199 ప్లాన్‌పై ఒక్కసారిగా రూ.100 పెంచి, ఇకపై రూ.299కే ఈ ప్లాన్ అమలులో ఉంటుందని జియో పేర్కొంది. పెంచిన ధరలు జనవరి 23 నుంచి అమలులోకి రానుందని తెలిపింది. ప్రస్తుతం రూ.199 ప్లాన్ కస్టమర్లు ఆటోమెటిక్‌గా రూ.299 ప్లాన్‌కు బదిలీ అవుతారు. ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాల్స్, నెలకు 25 జీబీ డేటా వస్తుంది.