భారీ మంచు అమెరికాను వణికిస్తోంది. యుటాలోని కాటన్‌వుడ్ కాన్యన్‌లో మంచు తుఫాన్ దూసుకొచ్చింది. పోలార్ వర్టెక్స్ కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గంటకు ఐదు అంగుళాల తీవ్రతతో మంచు కురుస్తోందని ‘నేషనల్ వెదర్ సర్వీస్’ తెలిపింది. మంచు తుపాను వల్ల దాదాపు 30 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.