ఏపీలో పింఛన్ తీసుకునే వారికి అలర్ట్. సోమవారం నుంచి ఈ నెల 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య పింఛన్లకు సంబంధించి వైద్య బృందం తనిఖీ చేపట్టనుంది. మంచానికే పరిమితమై నెలకు రూ.15 వేల పింఛన్ పొందుతున్న వారు, దివ్యాంగుల కోటాలో నెలకు రూ.6 వేలు పొందుతున్న వారి పింఛన్లను తనిఖీ చేస్తారు. మంచానికి, వీల్ చైర్‌లకు పరిమితమైన వారి ఇంటికి వైద్య బృందం వెళ్లి పరీక్షించనుంది. దివ్యాంగులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించనుంది.