ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన 116 ఏళ్ల టొమికో ఇటుకా ఇకలేరు. జపాన్‌కు చెందిన ఈమె డిసెంబర్ 29వ తేదీ మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఆమె 70వ ఏట జపాన్‌లోని 3,067 మీటర్ల ఎత్తయిన ఒంటాకే పర్వతాన్ని రెండుసార్లు అధిరోహించారు. గిన్నిస్ రికార్డు ప్రకారం.. గత ఏడాది అత్యంత వృద్ధురాలిగా ఉన్న స్పెయిన్‌కు చెందిన మరియా బ్రాన్యాస్ మొరెరా (117) కన్నుమూయడంతో ఇటుకాకు రికార్డు దక్కింది.