దంతాలకు షుగర్ ఎటాక్

60చూసినవారు
దంతాలకు షుగర్ ఎటాక్
రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోవడమే డయాబెటిస్‌. అయితే మధుమేహం అదుపులో లేకపోతే అది రోగి శరీరంలోని వివిధ అవయవాలపై ప్రభావం చూపుతుంది. వీటిలో దంతాలు కూడా ఉండటం గమనార్హం. షుగర్‌ వల్ల చిగుళ్ల వ్యాధులు అధికంగా వస్తాయి. చిగుళ్లలో ఇన్ఫెక్షన్‌ ఏర్పడి అవి వాపునకు గురవుతాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇన్పెక్షన్‌ పెరిగిపోయి దంతాల చుట్టూ ఉండే దవడ ఎముక క్రమంగా కోతకు లోనవుతుంది. దవడ ఎముక విరిగిపోవడం వల్ల దంతాలు వదులైపోతాయి.

ట్యాగ్స్ :