ఓటమి గురించి ప్రశ్న.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

63చూసినవారు
ఓటమి గురించి ప్రశ్న.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలు చివరి దశకు చేరుకోవటంతో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు ఏ రకంగానైనా ఓడిపోయే అవకాశం ఉందా అని ఓ రిపోర్టర్ ట్రంప్‌ని ప్రశ్నించారు. దానికి ట్రంప్ బదులిస్తూ.. ‘అవును.. ఓటమిని నేను ఊహిస్తున్నాను. కానీ నేను గణనీయమైన లీడ్‌లో ఉన్నాను. కొన్నిసార్లు చెడు జరగొచ్చు. అలా జరుగుతూ ఉంటుంది’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్