‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ ఎవరో తెలుసా?
'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-ది రూల్' గురువారం (డిసెంబర్ 5) విడుదల కాగా, బుధవారం రాత్రి ప్రీమియర్లు జరిగాయి. అయితే పుష్ప 2 షోలు పడడంతో ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ ఎవరో తెలిసిపోయింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెట్ఫ్లిక్స్’ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. భారీ ధరకు హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక నెట్ఫ్లిక్స్లో పుష్ప 2 స్ట్రీమింగ్ అవ్వనుంది.