‘పుష్ప2’ సినిమా స్టోరీ ఇదే

74చూసినవారు
‘పుష్ప2’ సినిమా స్టోరీ ఇదే
షిప్ యార్డులో ఎర్రచందనం స్మగ్లింగ్ సీన్ తో పుష్ప 2 ప్రారంభమవుతుంది. అల్లు అర్జున్ మాస్ ఎంట్రీ థియేటర్ ను దద్దరిల్లేలా చేస్తుంది. శేషాచ‌లం అడ‌వుల్లో ఓ కూలీగా ప్ర‌యాణం మొద‌లుపెట్టి ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ సిండికేట్‌ను నడిపే నాయకుడిగా ఎదుగుతాడు పుష్ప‌రాజ్ (అల్లు అర్జున్‌). త‌న దారికి ఎవ్వ‌రు ఎదురొచ్చినా స‌రే త‌గ్గేదేలే అంటూ ఢీ కొట్టడ‌మే అతడికి తెలుసు. డ‌బ్బంటే లెక్క‌లేదు, ప‌వ‌ర్ అంటే భ‌యం లేదు. కథ మొత్తం అల్లు అర్జున్, ఫహాద్, రావు రమేష్ చుట్టూ నడుస్తుంది. ఒక్క ఫోటో కోసం ఏకంగా సీఎంనే మార్చేయడం ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్ రెండు కుటుంబాలు ఒకటి కావడంతో ముగుస్తూ మూడో పార్ట్ 'పుష్ప ది ర్యాంపేజ్'కి తెరలేపుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్