అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు: సీఎం చంద్రబాబు (వీడియో)
AP: సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. అర్హులైన పేదలకు త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గురువారం కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2029 నాటికి అర్హులందరికీ ఇళ్లు నిర్మిస్తామన్నారు. స్థలాలు లేని పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు మంజూరు చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఎస్సీలు, చేనేతలకు అదనంగా రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు ఇస్తామన్నారు. త్వరలో నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.