నేను జర్నలిస్టును కొట్టాలని అనుకోలేదు: మోహన్‌బాబు

69చూసినవారు
నేను జర్నలిస్టును కొట్టాలని అనుకోలేదు: మోహన్‌బాబు
సినీ నటుడు మోహన్‌బాబు ఓ జర్నలిస్టుపై దాడి చేయడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఆయన తాజాగా స్పందించారు. తాను జర్నలిస్టును కొట్టాలని దైవసాక్షిగా అనుకోలేదని తెలిపారు. ‘‘కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? ప్రజలు, రాజకీయ నాయకులు దీనిపై ఆలోచించాలి. నా ఇంట్లోకి దూసుకొచ్చేవాళ్లు జర్నలిస్టులా.. కాదా నాకు తెలియదు. మీడియాను అడ్డుపెట్టుకొని నాపై దాడి జరగొచ్చని ఆలోచించాను. జరిగిన ఘటనకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నా’’ అని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్