మునగాల మండల కేంద్రంలోని శ్రీ వెంకట కనకదుర్గమ్మ ఆలయంలో శుక్రవారం ప్రభ బండ్ల ఉత్సవాల జాతరలకు ఆలయం ముస్తాబు అయింది. ఆలయాన్ని రంగు, రంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేసారు. ఆలయంలో కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. గ్రామంలోని రైతులు ట్రాక్టర్లకు బండ్లకు ప్రభలు కట్టి ఆలయం వద్దకు వస్తారు. కనకదుర్గమ్మ జాతర అనంతరం గ్రామస్తులు వనవాసానికి వెళ్లడం సాంప్రదాయపరంగా వస్తుంది.