
కాపుగల్లులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
ఇఫ్తార్ విందులు పుణ్యకార్యాలని కాపుగల్లు గ్రామ బీఆర్ఎస్ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త దొంతగాని అప్పారావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో గల మసీదులో ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు పుణ్య కార్యాలని అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.