గత ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చింది: పవన్
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మార్చిందని, ఇప్పుడు ఇదే పెనుముప్పుగా మారిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎక్స్ వేదికగా.. ‘విశాఖలో సీజ్ చేసిన డ్రగ్స్ లింకులు విజయవాడలోని ఓ కంపెనీలో తేలాయి. ఇలాంటివి ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. కేంద్ర హోంశాఖ స్పందించి డ్రగ్స్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి.’ అని పవన్ ట్వీట్ చేశారు.