గణిత మేళలు విద్యార్థుల్లో గణితం అభిరుచిని మెరుగుపరుస్తాయని అనంతగిరి మండలం గొండ్రియల హై స్కూల్ ఇన్చార్జి హెడ్మాస్టర్ అశోక్ రెడ్డి అన్నారు. సోమవారం పాఠశాలలో మ్యాథ్స్ ఎక్సిబిషన్ ప్రారంభించి మాట్లాడారు. గణిత శాస్త్రవేత్త రామానుజన్ ను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు గణితశాస్త్రంలో ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో గణిత శాస్త్ర ఉపాధ్యాయులు మండవ ఉపేందర్ తదితరులు ఉన్నారు.