క్రిస్మస్ వేడుకల్లో ఊహించని ప్రమాదం.. పిట్టల్లా రాలిన డ్రోన్లు

78చూసినవారు
క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఫ్లోరిడాలో నిర్వహించిన డ్రోన్ షోలో ఊహించని ప్రమాదం జరిగింది. ఏరియల్ లైట్ షోలో భాగంగా డ్రోన్ల ప్రదర్శనను చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ప్రదర్శన జరుగుతున్న సమయంలో అనుకోకుండా గాలిలో ఎగురుతున్న వందల కొద్దీ డ్రోన్లు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. అవి వేగంగా వచ్చి కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రేక్షకులపై పడడంతో ఏడేళ్ల బాలుడితో సహా పలువురు గాయాలపాలయ్యారు.

సంబంధిత పోస్ట్