కోదాడ: గణిత ఫోరం కృషి అభినందనీయం.. ఎంఈఓ

53చూసినవారు
కోదాడ: గణిత ఫోరం కృషి అభినందనీయం.. ఎంఈఓ
టాలెంట్ టెస్టులతో విద్యార్థుల్లో పోటీ తత్వం పెరుగుతుందని కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ అన్నారు. శుక్రవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో, మండల గణిత ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్టు విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కోదాడ గణితం ఫోరమ్ అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి జీవని, ధనమూర్తి, పాండురంగ చారి, ఖాజా మీయా, శ్రీనివాసరావు, శైలజ, మోతిలాల్, రామ్మోహన్ రావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్