నల్గొండ: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్

51చూసినవారు
నల్గొండ పట్టణ సమీపంలోని పానగల్ అద్దంకి బైపాస్ వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త ఫ్లై ఓవర్ పైన దట్టమైన పొగమంచు కారణంగా ఆగి ఉన్న లారీని కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ క్యాబిన్ నుజ్జునుజ్జు అయింది. క్యాబిన్ లో డ్రైవర్ ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్